HNK: అన్ని రకాల ప్రభుత్వరంగ నియామకాల్లో 11% వాటా మాదిగలకు కేటాయించాలని ఎంఎస్పీ జాతీయ నేత మంద కుమార్, ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బిక్షపతి అన్నారు. హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో మీడియాతో వారు మాట్లాడుతూ.. మాదిగలలో ఉన్న పేదరికాన్ని తొలగించడానికి తగిన సంక్షేమ పథకాల్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టాలని, ప్రభుత్వ భూములను మాదిగలకు పంచాలని అన్నారు.