BHPL: గణపురం మండలం చెల్పూర్ గ్రామ వాస్తవ్యులు, BRS రాష్ట్ర నాయకులు గొట్టేముక్కుల కేశవరావు తల్లి తిరుపతమ్మ దశదిన కర్మ కార్యక్రమం శుక్రవారం జరిగింది. మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతమ్మ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. అనంతరం కేశవరావు కుటుంబాన్ని పరామర్శించి వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.