వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ సెంటర్లో సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ నేతలు అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.