TG: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. పీఆర్సీ, డీఏలు, ఓపీఎస్ హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ పబ్లిసిటీపై ఉన్న శ్రద్ధ ఉద్యోగుల సమస్యలపై లేదన్నారు. డీలిమిటేషన్ నెపంతో ‘నార్త్ వర్సెస్ సౌత్’ రాజకీయాలు చేస్తూ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.