RR: హఫీజ్పేట్ డివిజన్ ప్రకాష్ నగర్ స్మశాన వాటికను కాంగ్రెస్ నాయకుడు గౌతమ్ గౌడ్ సందర్శించారు. కాలనీ వాసుల విన్నపం మేరకు అధికారులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, స్మశాన వాటికలో మౌలిక సదుపాయాలు కల్పించి త్వరితగతిన ఆధునీకరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.