మన్యం జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రతలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్దులు, పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవి నేపథ్యంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, అందువల్ల శరీరం నీటిశాతం ఎక్కువగా కోల్పోతారు అన్నారు.