HYD: ఉత్తరాంధ్ర సేవా సమితి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని MLA బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం కుషాయిగూడ పారిశ్రామిక ప్రాంతంలో ఉత్తరాంధ్ర సేవా సమితి అధ్యక్షులు దండుగుల తారకేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సమితి ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.