SRCL: ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. ఆలయ అర్చకులు గ్రామస్తులు ఆలయ పాలకవర్గం ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్బంగా కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.