ADB: బజార్హత్నూర్ మండలం భోస్ర గ్రామంలో మహాత్మ బసవేశ్వర జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రామస్థులు ఘన నివాళులర్పించారు. బసవన్న బోధనలు సమాజానికి దిక్సూచి అని, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.