AP: సీఎం చంద్రబాబు మత్స్యకారులను మోసం చేశారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. జెట్టీలు, హార్బర్ల నిర్మాణంలో విఫలమయ్యారని విమర్శించారు. ‘జగన్ హయాంలో పోర్టులకు శ్రీకారం చుట్టారు. జగన్ హయాంలో 10 హార్బర్లు నిర్మించారు. కరోనా వంటి కష్టకాలంలో జువ్వలదిన్నెలో అద్భుతమైన హార్బర్‌ను నిర్మించి చూపారు. 2029లో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారు’ అని ధీమా వ్యక్తం చేశారు.