TG: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరపూర్లో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయట్లేదని సొసైటీకి తాళం వేశారు. సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. 15 రోజుల నుంచి సొసైటీ కార్యదర్శి రావట్లేదని అంటున్నారు. ఏప్రిల్ 4న కోసిన వడ్లకు ఇప్పటికీ కాంటాలు పెట్టక పోగా, 18న కోసిన వడ్లు వెంటనే కాంటాలు పెట్టారని రైతులు ఆరోపించారు.