SRCL: మీటర్ లేని పేద తరగతి (BPL) విద్యుత్ వినియోగదారులకు రాయితీ ధరలతో కొత్త సర్వీసులను మంజూరు చేస్తూ టీజీఎన్పీడీసీఎల్ (TGNPDCL) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ టి. వేణుమాధవ్ ఓ ప్రకటను జారీ చేశారు. 500 వాట్ల లోపు విద్యుత్ వినియోగించే వారి సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు తక్కువ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.