JN: రఘునాథపల్లి మండలంలోని టోల్గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. వేసవికాలంలో బాటసారిల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని, చలివేంద్రాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మాజీ ZPTC బొల్లం మణికంఠ, తదితరులు ఉన్నారు.