MDK: వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో 42 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఈ పత్రాలను పంపిణీ చేశారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.