MHBD: గార్ల-డోర్నకల్ మధ్య గల రైల్వే గేటును మరమ్మత్తుల కారణంగా ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గేటు వద్ద అత్యవసర నిర్వహణ పనులు చేపడుతున్నందున వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.