NLR: కందుకూరు పరిధిలోని వీవోఏలకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను సమకూర్చింది. కందుకూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా ఐదు మండలాల వీవోఏలకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. స్వయం సహాయక సంఘాల పనితీరు మెరుగుపడేందుకు, రికార్డుల నిర్వహణ, డిజిటలైజేషన్ వేగవంతం కావడానికి ఇవి ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.