TG: వికారాబాద్(D) పెద్దేముల్ మండలం తట్టేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా, ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్తతో పాటు కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరు రుక్మాపూర్ నుంచి జహీరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.