NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే కుడి కాల్వకు అధికారులు శనివారం ఉదయం నీటి విడుదలను నిలిపివేశారు. ఆంధ్ర ప్రాంతంలో యాసంగి సీజన్ పంటలు పూర్తయిన నేపథ్యంలో కుడికాలువకు డ్యామ్ అధికారులు నీటిని నిలిపివేశారు. కాగా ఇదిలా ఉంటే సాగర్ ఎడమకాల్వకు కూడా మరో రెండు రోజుల్లో నీటి విడుదలను నిలిపి వేసే అవకాశం ఉందని డ్యాం అధికారులు తెలిపారు.