దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1566 పాయింట్లు నష్టపోయి 75,983 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 464 పాయింట్ల నష్టంతో 23,586 దగ్గర కొనసాగుతోంది. దీంతో కేవలం 8 నిమిషాల్లోనే దాదాపు రూ.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.39 వద్ద ఉంది.