MDK: నిజాంపేట మండలంలో ఎండల తీవ్రతకు జలవనరులు అడుగంటాయి. రజాక్ పల్లిలోని పోచమ్మ చెరువు ఎండిపోవడంతో పశువులు, గొర్రెలు నీరు లేక విలవిల్లాడుతున్నాయి. నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి కెనాల్ నీటిని చెరువులకు మళ్లించి, మూగజీవాలను ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.