TG: డీలిమిటేషన్లో భాగంగా అత్యధిక ఆదాయం ఇచ్చే ప్రాంతాలకే ఎక్కువ సీట్లు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి వాదనను బండి సంజయ్ ఖండించారు. ‘ఇదే నిజమైతే హైదరాబాద్కి అన్ని సీట్లు ఇవ్వాలా? మరి మీరు పుట్టిన పాలమూరుకు, వెనుకబడిన ఆదిలాబాద్ వంటి జిల్లాలకు సీట్లు పెంచాల్సిన అవసరం లేదా?’ అని ప్రశ్నించారు. అంబేద్కర్ బతికుంటే కాంగ్రెస్ను దేశం నుంచి బహిష్కరించేవారని అన్నారు.