WGL: ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మరో 6 స్థానాలు ఏర్పాటు కానున్నాయి. 2011 జనాభా గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 35,12,576 మంది ఉండగా, పురుషులు 17,59,772 మంది, మహిళలు 17,53,295 మంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 12 నియోజకవర్గాలకు ఈ కొత్త స్థానాలు చేరనున్నాయి. ఈ మార్పుల తర్వాత ప్రస్తుత సాధారణ నియోజకవర్గాలన్నీ మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.