ఏలూరు: చింతలపూడి మండలం వెలగలపల్లి గ్రామ శివారులో జరుగుతున్న ఏలూరు ప్రధాన రహదారి మరమ్మతు పనులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని పర్యవేక్షించిన ఆయన, పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని అధికారులను ఆదేశించారు. రహదారి మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని, అదే సమయంలో ఎక్కడా నాణ్యత లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.