MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రం భూమి పూజ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని, కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ఆయన కాంట్రాక్టర్కు సూచించారు.