MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ లో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా కార్పొరేటర్ కర్రు శంకర్ పర్యవేక్షణలో కార్మికులు ఆదివారం వివిధ కాలనీలలో డ్రైనేజీలలో పూడిక తీసి శుభ్రం చేశారు. అలాగే ముఖ్య కూడళ్లలో పేరుకుపోయిన చెత్తా చెదారం తొలగించి ట్రాక్టర్ ద్వారా తరలించారు.