HYDలో కొన్నిచోట్ల భారీ స్థాయిలో భూగర్భ జలాలను గుంజేస్తున్నారు. ఖైరతాబాద్, అల్వాల్, సైదాబాద్, హిమాయత్ నగర్,కుత్బుల్లాపూర్, చార్మినార్, అమీర్‌పేట్, గోల్కొండ, ముషీరాబాద్, షేక్‌పేట, అసిఫ్‌నగర్‌లో అత్యధికంగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నట్లుగా భూగర్భ జల శాఖ అధికారులు గుర్తించారు. అసలే వేసవి వేళ, ఈ దెబ్బతో భూగర్భ జలాలు లోతుకు వెళ్తున్నాయి.