AP: జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. ‘సీఎం సహాయ నిధి నుంచి రూ.1300 కోట్లు ఖర్చు పెట్టాం. త్వరలో కొత్త పెన్షన్లు రిలీజ్ చేయబోతున్నాం’ అని వెల్లడించారు. అలాగే, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ రావాలని అన్నారు.