WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలోని శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నూతన రథం, రథశాల ప్రారంభోత్సవం ఈ నెల 21న (మంగళవారం) జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఆదివారం గ్రామ కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎద్దు సత్యనారాయణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.