AP: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాకినాడ భానుగుడి సెంటర్లోని ఆయన ఇంటి వద్ద 20 మందికి పైగా పోలీసులు ఉన్నారు. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.