JN: జఫర్గడ్ మండల కేంద్రంలోని కేజీబీవీలో సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, వంటశాల పరిశుభ్రత, నిల్వలు, ప్రొవిజన్ రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. ఆహార సరఫరా విధానం, నిల్వల నిర్వహణపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ స్వప్న, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.