HNK: పరకాల పట్టణంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) ఏర్పాటుకు MLA రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కలిసి భూమిని పరిశీలించారు. యువతకు ఆధునిక నైపుణ్యాలు అందించి ఉపాధి అవకాశాలు పెంచడంలో ఏటీసీ కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. పరకాలను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో పలు విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.