నిర్మల్‌కు చెందిన వరణ్య అనే చిన్నారి జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్ ప్రాంతంలోని ఆఫర్వాత్ పర్వతంపై సుమారు 4000 అడుగుల ఎత్తులో, -4°C చలిలో ఇటీవల కూచిపూడి నృత్యం చేసి ప్రతిభ చాటింది. ఈ అరుదైన ప్రదర్శనపై ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేడు అభినందించి శాలువాతో సత్కరించారు. చిన్నారి మరిన్ని ప్రదర్శనలు చేసి జిల్లా ఖ్యాతిని నిలబెట్టాలని ఆకాంక్షించారు.