రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న ‘వారణాసి’ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 24-26 వరకు మెక్సికోలో జరిగే ‘కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్’లో ఈ సినిమా ఎక్స్క్లూజివ్ కంటెంట్, మేకింగ్ వీడియోలు ప్రదర్శించనున్నారు. ఎస్ఎస్ కార్తికేయ ఈ వేడుకకు హాజరుకానుండగా, రాజమౌళి వీడియో సందేశం ఇవ్వనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.