PPM: సీతానగరం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తితో పూజిస్తే అనుకున్న కోర్కెలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఇక్కడ స్వామివారికి ముడుపుకట్టి 9 వారాలు 27 ప్రదక్షిణలు చేసి 10వ వారం ఇష్ట దైవసన్నిధిలో ముడుపు సమర్పిస్తే అనుకున్న కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.