KDP: అట్లూరు మండలం చిన్న కామసముద్రానికి చెందిన రాజవోలు అశోక్ రెడ్డి (34) బుధవారం రైలు కింద పడి మృతి చెందిన విషయం తెలిసిందే. రైల్వే పోలీసులు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి 2 నెలల క్రితమే వివాహమైందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.