ELR: రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా భీమడోలు మండలం సూరప్పగూడెం జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కలిగించారు. ఈ సందర్బంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ.. యువత థ్రిల్ కోసం బైక్‌లను అతివేగంగా నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ప్రయాణ సమయంలో హెల్మెట్‌ను ధరించాలని సూచించారు.