AP: పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. రామదుర్గం కొండ పరిసరాల్లో పులి కదలికలను టెలీకాలర్ సిగ్నల్స్ ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. పొలాలకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని, రాత్రివేళల్లో బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించారు. అటవీశాఖ ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసింది.