AP: బాపట్ల జిల్లాలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా అరవపల్లి-గంగడిపాలెం సీసీ రోడ్డుకు, ఇండోర్ ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లాను ఏపీలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి గ్రామానికి అభివృద్ధి అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు.