కృష్ణా: ప్రతి స్టేజీలు బస్సులను ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని గన్నవరం డిపో మేనేజర్ శివాజీ సిబ్బందిని ఆదేశించారు. గన్నవరం ఏపీఎస్ఆర్టీసీ డిపోలో ఆయన బస్సు డ్రైవర్లు, డాక్టర్లతో సోమవారం ఉదయం సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా వారి అవసరం కోసం ప్రతి చోట బస్సును నిలిపి ఎక్కించుకోవాలని ఆదేశించారు.