ADB: ఉట్నూర్ ఏజెన్సీలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో రబీ జొన్న సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వందల ఎకరాల్లో జొన్న పంట కోత దశకు చేరుకున్న తరుణంలో అకాల వర్షం రావడంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండి పంటను రక్షించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.