పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం థియేటర్లలో నిరాశపరిచినప్పటికీ, ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతోంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఏకంగా 10కి పైగా దేశాల్లో టాప్ ట్రెండింగ్లో నిలవడం విశేషం. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితం వచ్చినా, డిజిటల్ వేదికపై మాత్రం పవర్ స్టార్ మేనియా కొనసాగుతోంది.