AP: సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాజకీయ ప్రత్యర్థులైనప్పటికీ జగన్ శుభాకాంక్షలు తెలపడం చర్చనీయాంశంగా మారింది. అయితే, నిన్న వైఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.