మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ డే) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయ సునీత ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేయవచ్చని చెప్పారు. జిల్లాలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.