కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి సోమవారం అమలాపురం వాస్తవ్యులు చక్క నాగ వెంకట సాయి రాజ్ సుష్మంత్ వారి కుటుంబ సభ్యులు రూ.1, 00,116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.