VZM: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 7:30లకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగాలని అమ్మవారిని వేడుకున్నారు.