NZB: మెరుగైన జీవనోపాధి కోసం ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలని మోర్తాడ్ MPDO తిరుమల అన్నారు. బుధవారం వాద్యాట్ గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధిహామీ పనులను సర్పంచ్ వై. శ్రీనివాస్, కార్యదర్శి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు. వేసవికాలం ఎండలు ఎక్కువగా ఉంటున్నందున ఉదయం పూటనే వచ్చి పనులు పూర్తిచేసుకోవాలని అన్నారు. వడదెబ్బకు గురికాకుండా ఉండాలని సూచించారు.