NDL: నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్‌లోని రైతు బజార్‌ను ఇవాళ కలెక్టర్ జి.రాజకుమారి అకస్మిక తనిఖీ చేశారు. వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందేలా చూడాలని విక్రయదారులకు సూచించారు. స్టాళ్ల నిర్వహణ, ధరల పట్టికలు, శుభ్రత, తాగునీరు వంటి సదుపాయాలపై ఆరా తీశారు. ఏమైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని అధికారులకు ఆదేశించారు.