NGKL: తెల్కపల్లి మండలం రాకొండ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును స్థానిక ఎమ్మెల్యే డాక్టర్.రాజేష్ రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్ బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.