NZB: నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామంలోని మూలమలుపు వద్ద బుధవారం మధ్యాహ్నం అట్టల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించి వాహనాలను పక్కకు తరలించారు.