ATP: పరిటాల రవి హత్య కేసులో అసలు హంతకులు ఎవరో తేల్చాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరిటాల కేసును తిరిగి విచారిస్తే వైఎస్ జగన్ ప్రమేయం బయటపడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సహా వైసీపీ నేతలు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.